
హీరోలు హీరోయిన్లు కాదు.. సంక్రాంతి హవా మొత్తం ఈ బుడ్డోళ్లదే!
అయితే ఈ సినిమాలో ఉన్న బుడ్డోడు కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో నటించిన అన్ని పాత్రలు ఒక లెక్కైతే చిన్నరాజు (వెంకటేష్) కొడుకు బుల్లిరాజు పాత్ర మరోఎత్తు. ఇక ఈ బుడ్డోది నటన విషయానికి వస్తే.. వాడి నటనతో అందరినీ నవ్వించాడు. ఈ బుడ్డోడి అసలు పేరు భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్. ఇక ఈ సినిమాలో ఈ బుడ్డోడి పాత్ర తన తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే చాలు బొమ్మ బొరుసు అయిపోద్ధి. వీడు గోదారి యాసలో తిట్టే తిట్లకు ఊరి వాళ్లకి చెవులు చిల్లులుపడితే.. ఆడియన్స్‌కి మాత్రం పొట్టచెక్కలు అవుతుంది. ఈ బుడ్డోడు మంచి నటుడే కాదు.. మంచి మాటకారి కూడా.
ఇకా డాకూ మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఓ పాప చుట్టూ తిరుగుతుంది. వైష్ణవి అనే పాత్ర పోషించిన చిన్నారి. ఆ పాప నటనని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఆ పాప పేరు వేద అగర్వాల్. ఈమె ఆగ్రాకు చెందిన అమ్మాయి. అయితే వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో సెటిల్ అయ్యింది. ఈ పాప నటి మాత్రమే కాదు మంచి సింగర్. సోషల్ మీడియాలో ఈ పాపకి 31 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘డాకు మహారాజ్’ వేద అగర్వాల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.