బాల‌య్య లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందా.. యువ‌ర‌త్నా నువ్వు సూప‌ర్‌..!

frame బాల‌య్య లైఫ్‌స్టైల్ ఇలా ఉంటుందా.. యువ‌ర‌త్నా నువ్వు సూప‌ర్‌..!

RAMAKRISHNA S.S.
నందమూరి నట‌సింహ బాలకృష్ణ నటప్రస్థానానికి 50 ఏళ్లు తాతమ్మ కల సినిమాతో బాలయ్య సినిమా కెరియర్ ప్రారంభమైంది 1974 ఆగస్టు 30న ఆ సినిమా రిలీజ్ అయింది గత ఏడాది బాలయ్య శనీశ్వర మహోత్సవం వైభవంగా జరిగింది ఈ క్రమంలోనే బాలయ్య గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. బాలయ్య లైఫ్ స్టైల్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. బాలయ్య తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేచి గంటపాటు వ్యాయామం చేస్తారు. అలాగే ముందు బాలయ్య పూజ పూర్తవుతుంది. తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలు తప్ప బాలయ్య ఇతర హీరోలు సినిమాలు పెద్దగా చూడరు. రోజు ఎన్టీఆర్ సినిమా ఏదో ఒకటి కొద్ది నిమిషాలు అయినా చూసిన తర్వాతే ఆయన నిద్రకు ఉపక్రమిస్తారు.

బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు వార్తాపత్రికలు చదువుతారు. అలాగే పుస్తకాలు చదవడం తక్కువ. తన గురించి తన సినిమా కథల గురించి మాత్రమే బాలయ్య ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. బాలయ్య మనసుకు నచ్చిందే చేస్తారు. డైట్ పేరుతో నోరు కట్టేసుకోవటం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. సినిమాల్లో పాత్రలకు తగినట్టుగా ఒదిగిపోయేందుకు శరీరాకృతి మార్చుకుంటారు. బాలయ్య ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తూ ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించి సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక తన విజయాల వెనక సతీమణి వసుంధ‌ర పాత్ర ఎంత ఉందని బాలయ్య ఎప్పుడు చెబుతూ ఉంటారు.

బాలయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ భార్య వసుంధర తన భర్త పై ప్రేమ చాటుకుంటూ ఉంటారు. బాలయ్య మనవాళ్ల తో ఉన్నప్పుడు చిన్నపిల్లాడిలా మారిపోతారు. వారిని సీఎం క్లాస్ మనవడు .. ఎం ఎం మాస్ మనవడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు. బాలయ్య కాలేజీ చదువుకునే రోజుల్లో క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్యకు క్లాస్మేట్ కావడం విశేషం. అలాగే లక్ష్మీనరసింహస్వామి అంటే బాలయ్యకు అపరిమితమైన భక్తి. సినిమాలపరంగా సింహ పేరు బాలయ్యకు సెంటిమెంట్ అన్నది తెలిసిందే. బాలయ్యకు తెలుగు అంటే మమకారం.. బాలయ్యకు ప్రత్యేకంగా ఒక మాస్టర్ తెలుగు పద్యాలు చెప్పేవారు. ఇక నెగిటివ్ ఆలోచనలు లేకపోవడం కల్మషం లేకపోవడం తన ఆరోగ్య రహస్యమని బాలయ్య వాళ్ళు సందర్భాలలో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: