టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం సోగ్గాడే చిన్నినాయన అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని 2016 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 వ తేదీన థియేటర్లో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి భారీ కలెక్షన్లను వసూలు చేసింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి నేటితో తొమ్మిది సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 12.08 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 7.3 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.04 కోట్లు , ఈస్ట్ లో 4.24 కోట్లు , వెస్టు లో 2.36 కోట్లు , గుంటూరులో 4.20 కోట్లు , కృష్ణ లో 2.05 కోట్లు , నెల్లూరులో 1.93 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 38.83 కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.88 కోట్లు , ఓవర్సీస్ లో 3.76 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 47.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 47.47 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో బయ్యారులకు 28.97 కోట్ల లాభాలు వచ్చాయి. అలా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.