హిట్లు ఉన్న వరుసగా అలాంటి పాత్రలు.. హాట్ బ్యూటీ అదృష్టం ఎప్పుడు మారెను..?

frame హిట్లు ఉన్న వరుసగా అలాంటి పాత్రలు.. హాట్ బ్యూటీ అదృష్టం ఎప్పుడు మారెను..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు రావాలి అంటే అందంతో పాటు ముఖ్యంగా విజయాలు తప్పని సరిగా ఉండాలి అనే వాదనను చాలా మంది , చాలా సందర్భాలలో వినిపిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువ విజయాలు ఉన్న ముద్దుగుమ్మలకు ఆటోమేటిక్ గా మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి వారు సినిమాలలో భాగం అయితే సినిమా స్థాయి మరింత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం మంచి విజయాలు దక్కుతున్న హీరోయిన్లను సినిమాల్లో తీసుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం ఇది తప్పు అని ప్రూవ్ అవుతూ వస్తుంది.

కొంతమంది నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోయిన వరుస పెట్టి క్రేజీ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె సవ్యసాచి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కొంత కాలం క్రితం ఈ నటి ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు మరిన్ని పెరిగాయి. కానీ విజయాలు మాత్రం పెద్దగా దక్కలేదు.

ఇలా ఈమె నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన కూడా ఈమెకి క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలు సాధిస్తే ఈమెకు మరిన్ని క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: