సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది ముద్దుగుమ్మలకు చాలా తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇకపోతే కొంత మంది హీరోయిన్స్ గా సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన స్థాయిలో కెరీర్ను కొనసాగిస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇక మరి కొంత మంది ఎక్కువ శాతం స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. పైన ఫోటోలో ఓ అమ్మాయి ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇకపోతే ఈమె ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అయిన ఓ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చింది. ఇప్పటికైనా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ..? పైన ఫోటోలో ఉన్న అమ్మాయి మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ఊర్వశి రౌటేలా. ఈ ముద్దుగుమ్మ ఎన్నో హిందీ సినిమాలలో నటించింది. ఈ మధ్య కాలంలో వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్టేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈమెకు మరిన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాలో కూడా ఈ బ్యూటీ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది. ఇలా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్ లతో ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.