అప్పుడు బన్నీ..ఇప్పుడు చరణ్.. ఇద్దరి పరువు ఆ పనితో గంగలో కలిసిపాయే పొ..!
అయితే తాజాగా పుష్ప 2 సినిమా విషయంలో కూసింత ఓవర్గా ప్రవర్తించారు అల్లు అర్జున్. దీంతో ఎలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే. పుష్ప రాజు క్యారెక్టర్ లో లీనం అయిపోయినట్లు సినిమా థియేటర్ వద్ద అల్లు అర్జున్ చేసిన హంగామా కారణంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ కారణంగా పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు కూడా చేశారు. ఒకరోజు జైల్లో కూడా పెట్టారు . ఇదంతా అందరికీ తెలిసిందే . గ్లోబల్ ఇమేజ్ దక్కించుకోవాల్సిన అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో గడిపాడు అన్న వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూనే ఉంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సైతం అదే విధంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు .
దానికి కారణం 'గేమ్ చేంజఋ సినిమా . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఈ సినిమాకి అసలు సైన్ ఎలా చేశాడు..? ఈ సినిమా ప్రమోషన్స్ అసలు సరిగా నిర్వహించలేదు.. అంటూ ఫైర్ అవుతూ వస్తున్నారు జనాలు . కాగా రీసెంట్ గానే శంకర్ ఈ సినిమాలో కొన్ని మంచి మంచి సీన్స్ లేపేసామంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. బహుశా ఆకారణంగానే సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు అంటూ కూడా అభిప్రాయపడ్డారు. దీంతో రాంచరణ్ పరువు పోయినట్లు అయింది . అసలు రాంచరణ్ ఈ సినిమా ఇంట్రెస్ట్ తోనే చేశారా ..? అలాంటి మంచి సీన్స్ ఎడిటింగ్ లో లేపేస్తున్నప్పుడు చరణ్ చెప్పాలిగా ..చరణ్ కి ఆ బాధ్యత ఉందిగా ..సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ శంకర్ కి ప్రాబ్లం లేకపోవచ్చు కానీ చరణ్ గ్లోబల్ ఇమేజ్ దెబ్బ తినే అవకాశం చాలా ఉంటుంది . ఆమాత్రం తెలియదా..? ఏదో టైం పాస్ కోసం సినిమా చేసావా..? అంటూ దారుణతి దారుణంగా చరణ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు ఆకతాయిలు .
దీంతో రామ్ చరణ్ కూడా పరువు పోగొట్టుకున్నట్టు అయింది. ఇద్దరు బడా పాన్ ఇండియా స్టార్స్ ఇలా తమ కెరియర్ విషయంలో ఒకరు హై స్పీడ్ లో మరోసారి స్పీడ్ లేకుండా బిహేవ్ చేసి ఉన్న ఇమేజ్ ని కాస్త డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకున్నారు అంటున్నారు జనాలు..!