ఆ హీరోయిన్ కోసం గొడవపడ్డ బన్నీ-తారక్.. ఫైనల్లీ ఎలా కూల్ అయ్యారు అంటే..?
కాగా వార్ 2 సినిమాతో అంతకుమించిన హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ . అయితే గతంలో వీళ్ళిద్దరూ హీరోయిన్ 'కాజల్' విషయంలో సరదాగా గొడవ పడ్డారట . కాజల్ - బన్నీ తోను అదే విధంగా తారక్ తో కలిసి చాలా సినిమాలలో నటించింది . అయితే తారక్ తో కలిసి 'బృందావనం' సినిమాకి ముందుగా సైన్ చేసింది కాజల్ . అయితే ఆ తర్వాత ఆర్య 2 సినిమాకి గాను కాల్ షీట్స్ ఇచ్చింది కాజల్ . అయితే కొన్ని కారణాల వల్ల 'బృందావనం' సినిమా లేటుగా స్టార్ట్ అయింది .
అప్పటికే ఆర్య సినిమా సగం షెడ్యూల్ పూర్తయిపోయింది . దీంతో కరెక్ట్ గా అదే మూమెంట్లో 'బృందావనం' సినిమాకి కూడా కాల్ షీట్స్ అడగడంతో కాజల్ ఇలా ఆర్య 2 సినిమాల నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చిందట . దీంతో వెంటనే జూనియర్ ఎన్టీఆర్ 'ఆమె నా హీరోయిన్ ముందు నాకే కాల్ షీట్స్ ఇచ్చింది.. నువ్వు సినిమా మళ్లీ చేసుకో.." అంటూ సరదాగా మాట్లాడారట. అయితే బన్నీ కూడా 'నా సినిమా సగం చేసేసింది బావ ఇప్పుడు ఎలా తీసేయమంటావు ..?ఎలా ఆపేయమంటావ్ ..?అంటూ సరదాగా మాట్లాడారట. సరదాగా గొడవ కూడా పడ్డారట . అయితే ఫైనల్లీ బన్నీ గెలిచాడు . కాజల్ చేత త్వర త్వరగా ఆర్య 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేయించుకుని ఆ తర్వాత బృందావనం సినిమాకి కాల్ షీట్స్ దక్కేలా చేసాడు . ఆర్య 2 సినిమా లో హీరోయిన్గా కాజల్ ఎలాంటి మంచి నటనను కనబరిచిందో అందరికీ తెలిసిందే . అయితే ఆర్య 2 నా..? బృందావనమా..? అంటే కాజల్ మాత్రం బృందావనం సినిమా అని చెబుతుంది . ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా చాలా స్పెషల్..!