ఆ కారణంతో బాధపడుతున్న మెగా ఫ్యాన్స్..?

frame ఆ కారణంతో బాధపడుతున్న మెగా ఫ్యాన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. అందరి కంటే ముందు సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లు విశ్వంభర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దానితో సంక్రాంతి పండక్కు కచ్చితంగా విశ్వంభర సినిమా విడుదల అవుతుంది అని జనాలు భావించారు.

ఓ వైపు బాలకృష్ణ "డాకు మహారాజ్" సినిమాలో నటిస్తూ ఉండడం , ఆ సినిమాను కూడా సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో మరోసారి చిరు , బాలయ్య మధ్య సంక్రాంతి వార్ నెలకొంటుంది అని చాలా మంది అభిమానులు భావించారు. అలాగే అసలైన సంక్రాంతి వార్ అంటే చిరు  , బాలయ్య దే అని , వారిద్దరి మధ్య పోటీ ఉంటే ఆ పోటీనే మజా గా ఉంటుంది అని భావించిన వారు కూడా ఉన్నారు. కానీ అనూహ్యంగా చిరంజీవి హీరోగా రూపొందిన విశ్వంభర సినిమాను రైస్ నుండి తప్పించారు. కానీ అదే ప్లేస్ లో చిరంజీవి కుమారుడు అయినటువంటి రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాను విడుదల చేయనున్నట్లు విశ్వంభర మూవీ యూనిట్ వారు అధికారికంగా ప్రకటించారు.

ఇక విశ్వంభర మూవీ యూనిట్ చెప్పినట్లుగానే గేమ్ చేంజర్ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి గొప్ప టాక్ రాకపోయినా ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తూ మంచి రన్ ను కంటిన్యూ చేస్తుంది. ఇక చిరంజీవి సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల అయితే బాగుండేది అని మెగా అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: