డాకు మహారాజ్ కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో HD ప్రింట్ ?

frame డాకు మహారాజ్ కు బిగ్ షాక్.. ఆన్లైన్ లో HD ప్రింట్ ?

Veldandi Saikiran
గాడ్ ఆఫ్ మాసేస్ గా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా డాకు మహారాజ్ సినిమాను థియేటర్లోకి తీసుకువచ్చారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య బాబుకు సంక్రాంతి బాగా కలిసి వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తూనే ఉంటాడు. మరి ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చిన బాలకృష్ణ ప్రేక్షకులకు ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి. కాగా, ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలకృష్ణ మంచి ఊపుతో దూసుకుపోతున్నాడు.

ఆయనకి అదే రేంజ్ లో సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు బాబి జత కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. చాందిని చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, సచిన్ కేడేకర్, హిమజ, హర్షవర్ధన్ వంటి తదితరులు కీలకపాత్రను పోషించారు. తమన్ సంగీతాన్ని అందించాడు.

కాగా, డాకు మహారాజ్ సినిమా విడుదలైన మొదటి రోజునే ఆన్లైన్ లో దర్శనమిచ్చింది. పైరసీ సైట్లలో హెచ్డి ప్రింట్ రావడంతో నందమూరి అభిమానులు షాక్ లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన గేమ్ చేంజర్ సినిమాను కూడా అదే రోజున ఆన్లైన్లో పెట్టారు. అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమాను బస్సులో ప్రదర్శించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా సినిమాలను లీక్ చేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని, పైరసీలను ఆపాలంటూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: