రాజమౌళి సినిమా కోసం ఏకంగా ఆఫ్రికన్ తెగల మధ్య అన్ని రోజులు గడిపిన మహేష్..?

frame రాజమౌళి సినిమా కోసం ఏకంగా ఆఫ్రికన్ తెగల మధ్య అన్ని రోజులు గడిపిన మహేష్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కే ఎల్ నారాయణ నిర్మాణంలో "ఎస్ఎస్ఎంబి 29" అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ కొన్ని రోజుల క్రితమే పూజ కార్యక్రమాలతో స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా ఏ ముద్దుగుమ్మ నటించబోతుంది అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పటికే అనేక సార్లు ఈ సినిమాలో మహేష్ కి జోడిగా ఆ బ్యూటీ నటించనుంది. ఈ బ్యూటీ నటించనుంది అని అనేక వార్తలు వచ్చాయి.


కానీ మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. దానితో ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటించే ముద్దుగుమ్మ పై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. ఇది ఇలా ఉంటే మహేష్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ , రాజమౌళి కాంబోలో రూపొందబోయే సినిమా అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ట్రెజర్ హంట్ కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. దానితో మహేష్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.


ఇకపోతే మహేష్ , రాజమౌళి ఆదేశానుసారం మసాయి , పిగ్మీస్‌ తెగల మధ్య ఆ ప్రాంతపు యుద్ధ విద్యలపై బేసిక్‌ స్పెషల్‌ ట్రైనింగ్‌ ను 20 రోజుల పాటు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసం మహేష్ ఇప్పటి నుండే అనేక కసరత్తులను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ , రాజమౌళి కాంబోకు సంబంధించిన మూవీ కథ మొత్తం కంప్లీట్ అయినట్లు కూడా ఆయన చాలా రోజుల క్రితమే చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: