అనసూయ: నైట్ లో భర్త కు తెలియకుండా ఆ పనులు?

frame అనసూయ: నైట్ లో భర్త కు తెలియకుండా ఆ పనులు?

Veldandi Saikiran
అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రతి ఒక్కరికి పరిచయమైన ఈ చిన్నది అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. జబర్దస్త్ షోలో తన హోస్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందం, చలాకీతనంతో వరుసపెట్టి అవకాశాలను దక్కించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎనలేని గుర్తింపు అందుకున్న అనసూయ ఆ షోలో యాంకరింగ్ చేస్తూనే అనేక షోలలో యాంకరింగ్ చేసింది. ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంది. అంతేకాకుండా సినిమా రిలీజ్ ఫంక్షన్లను కూడా నిర్వహించింది.


ఓవైపు వీటన్నిటిలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది. తన నటనతో దర్శక నిర్మాతల చూపు తన వైపుకు తిప్పుకుంది. అనసూయకు సినిమాలలో వరుస పెట్టి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఎదురుచూసేవారు. ప్రస్తుతం అనసూయ విపరీతంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. జబర్దస్త్ షోకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఈ మధ్యకాలంలో మళ్లీ జడ్జిగా వ్యవహరిస్తోంది.


అనసూయ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తన కుటుంబానికి అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. తన కుటుంబంతో సమయాన్ని గడపడానికి అనసూయ చాలా ఆసక్తిగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో అనసూయ ఏం చేసినా పెద్ద హల్చల్ అవుతోంది. తనకు సంబంధించి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది.


కాగా ఈ క్రమంలోనే తాజాగా అనసూయకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అనసూయ రాత్రి సమయంలో తన భర్తకు తెలియకుండా సీక్రెట్ గా ఓ పనిని చేస్తుందట. తన భర్తకు తెలిస్తే సీరియస్ అవుతాడనే భయంతో తనకు ఇష్టమైన జంక్ ఫుడ్ బుక్ చేసుకుని తింటుందట. తన భర్తకి బయట ఫుడ్ అసలు ఇష్టం ఉండదట. కానీ అనసూయకి మాత్రం బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందుకే తన భర్తకు తెలియకుండా రాత్రి సమయంలో ఇలాంటి పనులు చేస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: