"చరణ్"ను అప్పుడు కాపాడిన దిల్ రాజు.. ఇప్పుడు నిండా ముంచేసాడా..?

frame "చరణ్"ను అప్పుడు కాపాడిన దిల్ రాజు.. ఇప్పుడు నిండా ముంచేసాడా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించి అందులో చాలా మూవీలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఇకపోతే చరణ్ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం చరణ్ "ఎవడు" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని 2014 వ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు.


ఇక ఈ మూవీ కి పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 1 నేనొక్కడినే సినిమా ఆ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ రెండు మూవీల మధ్య భారీ పోటీ నెలకొంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ 1 నేనొక్కడినే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఎవడు సినిమా ఆ సంవత్సరం అద్భుతమైన కలక్షన్లను వసూలు చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇలా ఆ సంవత్సరం చరణ్ ను సంక్రాంతి విన్నర్ గా నిలిపిన దిల్ రాజు తాజాగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీ ని నిర్మించాడు.


ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. దానితో ఎవడు సినిమాతో 2014 వ సంవత్సరం చరణ్ ను సంక్రాంతి విన్నర్ గా నిలిపిన దిల్ రాజు ఈ సంవత్సరం కూడా అద్భుతమైన బ్లాక్బస్టర్ ను ఇచ్చి సంక్రాంతి విన్నారుగా నిలుపుతాడు అని చాలా మంది భావించారు. కానీ నిన్న విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి గొప్ప టాక్ రాలేదు. దానితో ఈ సినిమా భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎలాంటి కలక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: