ట్రైలర్: బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు..అదరగొట్టేస్తున్న డాకు మహారాజ్ ట్రైలర్..!
దీంతో అభిమానుల సైతం నిరాశ చెందడంతో వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు సైతం చిత్ర బృందం తాజాగా రెండవ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. కారు చిచ్చు అడవి అంటుకున్నట్టుగా చూపిస్తారు.. వాడి ఒంటి మీద 16 కత్తిపోట్లు అనే డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది.. ఒక బుల్లెట్ కూడా ఉంటుంది అన్నప్పుడు బాలయ్య అని చూపించడం జరిగింది. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ గొడ్డలితో సిగరెట్ తాగే సన్నివేశం హైలైట్ గా నిలుస్తోంది. అతడు మనిషి కాదు వైల్డ్ యానిమల్ అనే డైలాగ్ అభిమానుల చేత వీలలు వేయించేలా చేస్తోంది.
ఈ ట్రైలర్లు యాక్షన్స్ సన్నివేషాలు ఎక్కువగా చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈసారి సంక్రాంతికి బాలయ్య హవా ఉంటుంది అంటూ అభిమానులు వెల్లడిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదుర్స్ అనేలా ఉన్నది బాలయ్య చెప్పే డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాలా కనిపిస్తున్నాయి. ఇక బాలయ్య చివరిలో చెప్పే డైలాగ్ రాయలసీమ నా అడ్డా చంపడంలో మాస్టర్ చేశా అంటూ డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తోంది. బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటిస్తూ ఉన్నారు.