డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి హీరో హీరోయిన్లుగా ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్..ఈ మూవీ జనవరి 10న విడుదల కాబోతుందని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహించారు మూవీ మేకర్స్.అయితే తాజాగా జనవరి 9 అర్ధరాత్రి ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు పడ్డాయి. ఇక బెనిఫిట్ షో చూసిన చాలా మంది సినిమా బ్లాక్ బస్టర్.. బొమ్మ హిట్ అనుకుంటూ ట్విట్టర్ రివ్యూలు ఇస్తున్నారు.అయితే గేమ్ ఛేంజర్ మూవీలో మాజీ సీఎం జగన్ పై పగ బాగానే తీర్చుకున్నారని, జగన్ ని టార్గెట్ చేసేలా డైలాగ్ బాగుంది అంటూ సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమాలో జగన్ ను ఉద్దేశించి ఉన్న డైలాగ్ ఏంటి..నిజంగానే జగన్ ని టార్గెట్ చేస్తూనే ఆ డైలాగ్ వచ్చిందా అనేది ఇప్పుడు చూద్దాం..
గేమ్ ఛేంజర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐఏఎస్ అలాగే ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేశారు.ముఖ్యంగా ఐఏఎస్ గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి అయినటువంటి విలన్ పాత్రలో నటించిన ఎస్.జె. సూర్యతో రామ్ చరణ్ కి వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఇక సీఎం పాత్రలో నటుడు ఎస్ జె సూర్య అదరగొట్టేసారు అని చెప్పుకోవచ్చు. ఇక సీఎం పాత్రలో నటించే ఎస్జే సూర్య పాత్ర పేరు మోపిదేవి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాలో సీఎం పాత్రలో నటించిన ఎస్జే సూర్య పదేపదే మోపిదేవి పాత్ర ఈ రాష్ట్రంలో 30 ఏళ్లు ఉండాలని,30 ఏళ్ల పాటు తానే సీఎం గా ఉండాలని కలలు కంటూ ఉంటాడు.
అయితే సీఎం పాత్రలో నటించిన సూర్య ఎలా అయితే 30 ఏళ్లు తానే సీఎం గా ఉండాలని కలలు కంటారో నిజజీవితంలో అచ్చం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాలలో 30 ఏళ్లు తాను సీఎంగా ఉండాలి అంటూ అర్థం వచ్చేలా ఎన్నో బహిరంగ సభలలో ఈ విషయాన్ని చెప్పారు.అయితే గేమ్ చేంజర్ లోని మోపిదేవి పాత్రలో 30 ఏళ్లు సీఎం కల అనే డైలాగుని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాశారు కావచ్చు అంటూ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ డైలాగ్ ని గేమ్ చేంజర్ లో బాగానే వాడేసారంటూ కామెంట్లు, ట్వీట్లు పెడుతున్నారు. మరి ఈ 30 ఏళ్ల కల అనే డైలాగ్ పై వైసిపి నుండి ఎవరైనా స్పందిస్తారా అనేది చూడాలి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్టాఫ్ బాలేదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టేసింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు