రికార్డుల గేమ్ ఛేంజర్ అనిపించుకున్న రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ తో కొత్త రికార్డ్స్ పక్కా!
గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఆ అంచనాలను సులువుగానే అందుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అద్భుతంగా ఉన్నాయని రామ్ చరణ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో ఉంది.
గేమ్ ఛేంజర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల పెంపు ఈ సినిమాకు ప్లస్ అయింది. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకపోవడం ఒక విధంగా మైనస్ అని చెప్పవచ్చు. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలయ్యాయి.
సంక్రాంతి సినిమాల రిలీజ్ తో పుష్ప2 సినిమాకు థియేటర్లు తగ్గాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. గేమ్ ఛేంజర్ టార్గెట్ 250 కోట్ల రూపాయలు కాగా చరణ్ సులువుగానే ఈ మార్క్ ను అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అల్లు అర్జున్ పుష్ప2 కు 20 నిమిషాలు జోడించడం ఎంతమేర ప్లస్ అవుతుందో చూడాలి.