త్వరలో శ్రీదేవి కూతురు పెళ్లా.. వరుడు ఎవరంటే..?
ప్రస్తుతం రామ్ చరణ్ తో తెలుగులో ఇమే ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. అయితే జాన్వి కపూర్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన శిఖర్ పహారియాతో రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్నేళ్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ కూడా పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కలిసే ఉంటున్నట్లు సమాచారం . అంతేకాకుండా తిరుపతికి వచ్చిన ప్రతిసారి కూడా ఇద్దరూ కలిసే వస్తూ ఉంటారు.. వెళుతూ ఉంటారు. దీంతో వీళ్ళ రిలేషన్ ఏంటన్నది సీక్రెట్ గా ఉంచుకోకుండా ఇలా తెలియజేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా కచ్చితంగా తన కూతురు జాన్వీ కపూర్ తిరుపతికి వస్తూ ఉంటుంది.అలా ఏడాదికి ఎన్నోసార్లు వచ్చి వెళ్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. జాన్వీ తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా శిఖర్ పహారియా ఆమె పక్కనే కనిపిస్తూ ఉంటారు.అయితే ఈసారి వీరిద్దరితో పాటు శిఖర్ తల్లి కూడా కనిపించడం జరిగింది. దీంతో వీరంతా ఒకేసారి కనిపించడంతో త్వరలోనే ఈ జంట నిశ్చితార్థం చేసుకొని వివాహం చేసుకోబోతోందని వార్తలు బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే వీరి వివాహం ఈ ఏడాది ఉంటుందా? లేకపోతే వచ్చే ఏడాది ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. మరి మీరు ఎలా స్పందిస్తారో చూడాలి.