తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇకపోతే వెంకటేష్ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సన్దవ్ అనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. దానితో ఈ సినిమాతో వెంకటేష్ కు బాక్సా ఫీస్ దగ్గర అపజయం దక్కింది. ఇకపోతే తాజాగా వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించాడు.
ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా ... బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ సినిమాలో నరేష్ ముఖ్య పాత్రలో నటించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయం ముగిసే సరికి ఈ మూవీ ట్రైలర్ కు 12.90 మిలియన్ వ్యూస్ , 249.1కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.