మోక్షజ్ఞ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై .. మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ..!
కొడుకు ను గ్రాండ్ గా టాలీవుడ్ కు పరిచయం చేద్దామం అనుకున్న బాలకృష్ణ ఆలోచనకు మొదట లోనే పెద్ద బ్రేక్ పడిన విషయం తెలిసిందే .. నందమూరి మోక్షజ్ఞ సినిమా అనౌన్స్మెంట్ కే పరిమితమైంది .. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరో గా సినిమా వస్తుందా రాదా అనే సందేహాలు ఈ కొత్త ఏడాది లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి .. ఆటు బాలకృష్ణ ఇటు నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన అప్పటికీ డౌట్స్ మాత్రం అలానే ఉంటున్నాయి ..
ఈ గ్యాప్ లో నందమూరి అభిమానుల నుంచి కొత్త డిమాండ్ బయటికి వస్తుంది .. నందమూరి మోక్షజ్ఞ ను పక్క మాస్ కమర్షియల్ సినిమా తో టాలీవుడ్ కు పరిచయం చేయాలని బాలయ్యను వారు కోరుతున్నారు .. ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు నుంచి మాస్ ఎలిమెంట్స్ ను మేము ఆశించలేమని .. కాబట్టి కొంత కాలం అతన్ని పక్కన పెట్టి మరో స్టార్ దర్శకుడు తో మోక్షజ్ఞ ను పరిచయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు . ఇక సోషల్ మీడియాలో తాజాగా మొదలైన ఈ చర్చ వెనక ఓ ఆసక్తికరమైన విషయం ఉందని అంటున్నారు ..
ఇక ఇది అభిమానుల నుంచి పుట్టికొచ్చిన డిస్కషన్ కాదు నందమూరి కాంపౌండ్ కు చెందిన కొంతమంది అగ్ర ప్రముఖులు దగ్గర నుంచి వచ్చిన పలు కామెంట్ల ద్వారా ట్విట్టర్లో మొదలైన చర్చ ఇది .. అయితే ఇప్పుడు ఇది చూస్తుంటే .. మోక్షజ్ఞ , ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కు సంబంధించి తెరవ వెనక ఏదో గట్టిగా జరుగుతుందని అర్థమవుతుంది .. అందరూ ఊహించినట్టు ఇదేదో చిన్న చిన్న కారణాల తో లేటవుతున్న సినిమా మాత్రం కాదు .. ఇదే క్రమంలో వచ్చే ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. ఇది నిజంగానే నందమూరి అభిమానులకు అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. ఈ చిత్రానికి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.