ఫ్యాన్స్ కి శంకర్ బిగ్ బిగ్ సర్ ప్రైజ్.. గేమ్ చేంజర్ లో ఆ మెగా హీరోలు కూడా..!

Thota Jaya Madhuri
డైరెక్టర్ శంకర్ ఎంత టాలెంటెడ్.. ఎంత ఎక్స్పీరియన్స్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఆల్ రౌండర్ ..ఏ కథను ఏ సినిమా హీరోతో తెరకెక్కిస్తే.. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ పాటకు ఎంత బడ్జెట్ పెట్టాలి.. ఏ సీన్ కు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్  హీరో హీరోయిన్ దగ్గర నుంచి రప్పించుకోవాలి అన్న విషయంలో బాగా ధిట్ట. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఓ వార్త బాగా వైరల్ గా మారింది. "గేమ్ చేంజర్" సినిమాలో ఓ మెగా హీరో కూడా కనిపించబోతున్నాడు అంటూ సరికొత్త న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.


మరికొద్ది రోజుల్లోనే సినిమా థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది అన్న మూమెంట్లో ఈ వార్త బయటకు రావడం వైరల్ అవుతుంది . ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ సినిమాలో చెప్పిన రెండు డైలాగ్స్ ను ఈ మూవీ లో సమయానుసారం శంకర్ వాడుకున్నారట . రామ్ చరణ్ తన బాబాయ్ తన తండ్రి డైలాగ్స్ ను ఈ సినిమాలో వాడుకున్నట్లు ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు తెర పై పలు క్లిప్స్ కూడా ప్లే అవుతాయట .


దీంతో సోషల్ మీడియాలో "గేమ్ చేంజర్" సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని వేరే లెవెల్లో తెరకెక్కించాడు అని .. అలాంటి డైలాగ్స్ ఒకటి రెండు వాడుకున్న పెద్దగా ప్రాబ్లం ఏమి రాదు అని ..ఒకే స్క్రీన్ పై చరణ్ - చిరంజీవి - పవన్ ని చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు జనాలు. అయితే ఇలా ఒక సినిమాలో క్లిప్స్ కాకుండా రియల్ గానే పవన్ - చరణ్ - చిరంజీవి నటించిన బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు . చూద్దాం మరి ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: