అద్భుతమైన సినిమాను వదిలేసి అట్టర్ ప్లాప్ సినిమా చేసిన మహేష్.. అదే కారణమా..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు ఒక హీరోతో సినిమా చేయాలని అనేక ప్రయత్నాలు చేసిన సందర్భంలో కొంత మంది హీరోలు మాత్రం బ్లాక్ బస్టర్ కథలతో వచ్చినప్పుడు వారి ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఆ తర్వాత ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా లేని కథలను ఓకే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ కెరియర్ లో కూడా ఒక సారి ఇలా జరిగినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడం కోసం తమిళ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి ఏ ఆర్ మురుగదాస్ చాలా కాలం నుండి ప్రయత్నాలు చేయగా వీరి కాంబో లో స్పైడర్ అనే మూవీ వచ్చింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇకపోతే ఏ ఆర్ మురుగదాస్ , మహేష్ బాబు తో స్పైడర్ సినిమా కంటే ముందే గజిని అనే సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా గజినీ సినిమా కథ మొత్తం పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు కు వినిపించాడట. కథ మొత్తం విన్న మహేష్ బాబు కు ఆ స్టోరీ పెద్ద గా నచ్చకపోవడంతో దానిని మహేష్ రిజెక్ట్ చేశాడట. కానీ మురుగదాస్ కి మాత్రం మహేష్ బాబు తో కచ్చితంగా సినిమా చేయాలి అనే కోరిక ఉండేదట.

దానితో ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలి అనే స్పైడర్ అనే కథను తయారు చేసి దానిని మహేష్ కు వినిపించగా ఈ కథ ఆయనకు సూపర్ గా నచ్చిందట. దానితో వీరి కాంబోలో స్పైడర్ మూవీ రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా బ్లాక్ బస్టర్ కథతో వచ్చినప్పుడు మురగదాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మహేష్ "స్పైడర్" స్టోరీ ఓకే చేసి అపజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: