అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నాం. హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ చిత్రం తీశాడు అనిల్. మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ ''మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఇప్పటివరకూ నాకు 'బొబ్బిలిరాజా', 'చంటి', 'గణేశ్', సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది పక్కా సంక్రాంతి సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాతో పాటు 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. దిల్‌రాజు నిర్మాణంలో చేసిన నాలుగు సినిమాలూ సూపర్ హిట్లు అయ్యాయి.
వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అనిల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్‌బ్యాకులు చెప్పొద్దు. సినిమా చూడండి. మామూలుగా ఉండదు'' అని అన్నారు.
ఈ సంక్రాంతికి వస్తున్న 'గేమ్ చేంజర్, 'డాకు మహారాజ్' సినిమాలు కూడా విజయం సాధించాలి. 'దిల్' రాజు, శిరీష్‌లతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా 'సంక్రాంతికి వస్తున్నాం' చూడండి మామూలుగా ఉండదు అన్నారు.ఈ క్రమంలో నే ఒకప్పుడు వెంకీ మామ తన కామెడీ టైమింగ్ తో ఎలా అయితే అలరించాడో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలానే అలరించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.ట్రైలర్ మొత్తాన్ని అనిల్ రావిపూడి ఫన్ తో నింపేశాడు. ట్రైలర్ ను చూస్తుంటే వింటేజ్ వెంకటేష్ గుర్తు రాక మానడు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక చివర్లో ” హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో ప్రతిసారి విక్టరీనే” అని సింబాలిక్ డైలాగ్ ను చెప్పి సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి ఈ సంక్రాంతికి మిగతా సినిమాలను పక్కకు నెట్టి.. సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.