బన్నీ-ప్రభాస్-తారక్ పని అయిపోయింది..నెక్స్ట్ ఇప్పుడు రామ్ చరణ్ వంతు..!
"గేమ్ చేంజర్" సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో చరణ్ చూస్తున్నప్పుడు చిరంజీవిని తెరపై చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు మెగా అభిమానులు . కాగా జనవరి 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చరణ్ బాగానే పాల్గొంటున్నారు. అయితే స్టార్ హీరో తమ సినిమా రిలీజ్ కి ముందు తెలంగాణ గవర్నమెంట్ చెప్పిన విధంగా యాంటి డ్రగ్స్ కోసం సహాయపడుతున్నారు .
"డ్రగ్స్ తీసుకోని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి" అనే విధంగా ఫ్యాన్స్ కి అదే విధంగా జనాలకి ఇంపార్టెంట్ మెసేజ్ ను షేర్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్. ఆల్రెడీ పుష్ప2 సినిమాకి ముందు బన్నీ ఆ పని చేసి శభాష్ అనిపించుకున్నాడు . రీసెంట్ గానే ప్రభాస్ అదేవిధంగా తారక్ ఆ పని కంప్లీట్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ ఆ పని చేయాల్సిన టైం వచ్చింది. రామ్ చరణ్ కూడా స్పందించాలి . స్పందిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!