అన్ని విషయాలలో పొగిడించుకునే ఉపాసన .. ఆ ఒక్క మాటల్లో మాత్రం ఎప్పుడూ జనాలకి నెగిటివ్ నే..!

Thota Jaya Madhuri
ఉపాసన అంటే అందరికీ ఒక స్పెషల్ ఫీలింగ్. మా ఇంటి అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు అందరు.  రామ్ చరణ్ భార్య అని కాదు ..మెగా ఇంటికి కోడలు అని కాదు.. అపోలో హాస్పిటల్స్  చైర్ పర్సన్ ప్రతాపరెడ్డి మనవరాలు అని కాదు .. ఉపాసనాన్ని ఉపాసనా గానే ఇష్టపడుతూ ఉంటారు జనాలు.  మరియు ముఖ్యంగా లేడీస్ ఉపాసన ని చూస్తూ ఇన్స్పి రేషన్ గా తీసుకుంటూ ఉంటారు.  ఆడవాళ్ళ పర్సనల్ విషయాలు.. ఆడవాళ్లు నాలుగు గోడల మధ్య ఎదుర్కొనే సమస్యలు.. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి..? అని చెప్పే సలహాలు, జనాలకి బాగా నచ్చేస్తూ ఉంటాయి. ఉపాసన సైతం నేను పెద్దింటి కోడలు, పెద్దింటి అమ్మాయి అని లేకుండా సామాన్య మహిళగా అందరితో కలిసిపోతూ ఉంటుంది .
చాలా చక్కగా అందరితో మింగిల్ అవుతూ ఉంటుంది.  అందుకే రామ్ చరణ్ కంటే కూడా చాలా మందికి ఉపాసన అంటేనే ఇష్టం . అలాంటి ఉపాసన సోషల్ మీడియాలో ఒకే ఒక విషయం కారణంగా ఎప్పుడు నెగిటివ్గా తనపై ట్రోలింగ్ జరిగేలా చేసుకుంటూ ఉంటుంది . అదే వారసుడు మేటర్ . మెగా ఫ్యామిలీకి వారసుడు కావాలి. అది ఫ్యాన్స్ కోరిక . అయితే ఉపాసన వర్షెన్  మాత్రం వేరేలా ఉంది.  తనకు ఎప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే అప్పుడే కంటాను అని .. మేము పిల్లలను పెంచడానికి సిద్ధంగా ఉంటేనే పిల్లలను ప్లాన్ చేస్తామని.. ఆమె పెళ్లయిన తర్వాత నుంచి చెప్పుకొస్తూనే ఉంటుంది ,.
రీసెంట్ గానే క్లీంకారకు జన్మనిచ్చింది. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు జనాలు . అయితే రీసెంట్గా మాకు బాబు కావాలి అంటూ పరోక్షకంగానే వారసుడు రావాలి ..మెగా ఫ్యామిలీ కి అన్న  విషయాన్ని రామ్ చరణ్ కు లెటర్ రూపంలో చెప్పింది . దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ఉపాసనకు టార్చర్ మొదలైంది . మెగా వారసుడు ఎప్పుడొస్తాడు..? ప్లాన్ చేసుకోండి..? అంటూ రకరకాలుగా ఆ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . అయితే ఉపాసన మాత్రం ఆ విషయాని ఏ మాత్రం పట్టించుకోకుండా.. తన లైఫ్ తనది అన్నట్లు ముందుకు వెళ్ళిపోతుంది.  తన షెడ్యూల్ తో తన బిజీగా ఉంది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: