సినిమా విడుదలకు ముందు చాలామంది సినీ పెద్దలు,క్రిటిక్స్ సినిమాలను చూస్తూ అది ఎలా ఉందో రివ్యూ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ కూడా క్రిటిక్ నుండి వచ్చేసింది. ఇంతకీ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి క్రిటిక్ ఏం రివ్యూ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ,అంజలి హీరోయిన్గా వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటించారు. అలాగే శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీ అనే సంగతి మనకు తెలిసిందే. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ని గ్రాండ్ గా చేశారు. అలా రీసెంట్గా రాజమండ్రి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా జరిపారు. అలాగే అనంతపురంలో కూడా జనవరి 9న మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
దీనికి చీఫ్ గెస్ట్ లుగా నారా లోకేష్ దర్శకధీరుడు రాజమౌళి హాజరవుతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటూ పోతే ఈ సినీ క్రిటిక్ ఇచ్చిన రివ్యూ మాత్రం ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది.ఇక ఆ క్రిటిక్ ఎవరయ్యా అంటే ఉమైర్ సందు. బాలీవుడ్ క్రిటిక్ గా పేరు తెచ్చుకున్న ఉమైర్ సందు ఇప్పటికే విడుదలైన ఎన్నో పాన్ ఇండియా సినిమాలకు ఆయన రివ్యూ ఇచ్చారు. రీసెంట్గా విడుదలైన పుష్ప-2 సినిమా కూడా ఆయన రివ్యూ ఇచ్చి బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పారు.అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న గేమ్ చేంజర్ సినిమా చూసి షాకింగ్ రివ్యూ ఇచ్చారు.గేమ్ ఛేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ బోరింగ్ గా ఉంది.. కాలం చెల్లిన స్క్రీన్ ప్లే,డైలాగ్స్ కథ..బోరింగ్ నరేషన్..సినిమాలో అన్ని చాలా పేలవంగా ఉన్నాయి.సినిమాల్లో నటించిన నటీనటుల యాక్టింగ్ కూడా అంత బాగాలేదు. ఇక ఈ సినిమా రివ్యూ విషయంలో రామ్ చరణ్ నన్ను తిట్టుకున్న పర్వాలేదు నన్ను క్షమించాలని కోరుతున్నాను.
ఫైనల్ గా ఈ సినిమాకి టోటల్ రివ్యూ టార్చర్.. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ అత్యంత బలహీనమైన సినిమా అంటూ సంచలన రివ్యూ ఇచ్చారు.ఇక ఉమైర్ సందు ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ ఇది నిజమేనా అని ఆశ్చర్యంతో కామెంట్లు పెడుతుంటే..మెగా ఫ్యాన్స్ మాత్రం ఉమైర్ సందు పై మండి పడుతున్నారు.. నువ్వు ఎలాంటి ట్వీట్లు పెడతావో అందరికీ తెలుసు. కాస్తయినా సిగ్గుండాలి..ఇలాంటి ట్విట్లు పెట్టడానికి..రివ్యూ చూసే సినిమా చూడడానికి జనాలు థియేటర్లకి వెళ్తారు. అలాంటిది నువ్వు సినిమా విడుదలకు మరికొద్ది రోజులు ఉన్న సమయంలో ఇలాంటి రివ్యూ ఇస్తే ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వెళ్తారు అని పెడుతున్నారు. ఇక మరి కొంతమందేమో ఆయన రివ్యూ ఎవరూ పట్టించుకోకండి.సినిమా బ్లాక్ బస్టర్.. కచ్చితంగా థియేటర్లో మిమ్మల్ని అలరిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి చూడాలి గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో.