తెలుగులో ఫ్లాప్..హిందీలో సూపర్ హిట్స్.. ఆ సినిమాలేవో తెలుసా..?

frame తెలుగులో ఫ్లాప్..హిందీలో సూపర్ హిట్స్.. ఆ సినిమాలేవో తెలుసా..?

Pulgam Srinivas
భారీ అంచనా ల నడుమ విడుదల అయి న కొన్ని తెలుగు సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోయి నా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనే కం ఉన్నా యి . అలా తెలుగు ప్రేక్షకులను డిసప్పాయిం ట్ చేసి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకు న్న తెలుగు సినిమాలు ఏవో తెలుసు కుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే ఈ మూవీ హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

నితిన్ హీరో గా మేఘ ఆకాష్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన "లై" సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ మూవీ హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. ఈయన ఇప్పటివరకు అనేక తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం సీత జయ జానకి నాయక అనే సినిమాల్లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో సీత సినిమా భారీ డిజాస్టర్ ను అందుకోగా జయ జానకి నాయక సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇలా తెలుగు ప్రేక్షకులను భారీ ఎత్తున ఆకట్టుకోలేకపోయినా ఈ రెండు సినిమాలు హిందీ ప్రేక్షకులను మాత్రం అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: