నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ , ఊర్వసి రౌటేలా , శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ట్రైలర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ సినిమా కథను తయారు చేస్తున్న కొత్తలో బాబి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్ర ఉండడంతో దాంట్లో దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలి అనుకున్నాడు.
దానికి ఆయన కూడా అంగీకరించాడు. ఇక కథ డెవలప్ అవుతున్న కొద్ది ఆ సినిమాలో అంతా కీలకమైన పాత్ర అది కాదు అనిపించింది. దానితో దుల్కర్ సల్మాన్ ను తీసుకోలేదు అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే వరుస విజయాల్లో ఉన్న బాలయ్య నటిస్తున్న మూవీ కావడం , వాల్టేరు వీరయ్య తర్వాత బాబి దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.