తండేల్ : సెకండ్ సాంగ్ అదిరిందిగా.. దేవీని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్..!!

murali krishna
అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. దీనిని చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్స్, టీజర్, బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ అవగా ఫుల్ వ్యూస్‌ను రాబట్టాయి.అయితే తండేల్ మూవీ 2024లోనే విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. దీంతో ఈసినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 7న థియేటర్స్‌లోకి రానుంది. తాజాగా, తండేల్ నుంచి సెకండ్ సాంగ్‌ రిలీజ్ అయింది. ‘నమో నమో నమ: శివాయ’ అని సాగే ఈ పాటలో శివుని భక్తులుగా సాయి పల్లవి, నాగచైతన్య మాస్ స్టెప్స్ వేసి దుమ్మురేపారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడారు.ఇదిలావుండగా నిర్మాత బన్నీ వాస్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో దీని చిత్రీకరణ గురించి గొప్పగా చెప్పారు. థియేటర్ లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో దర్శకుడు చందూ మొండేటి చిత్రీకరించాడని తెగ ఊరించారు.

దానికి తగ్గట్టే దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ తో అదరగొట్టగా రెండు కళ్ళు చాలవనే రీతిలో చైతు, సాయిపల్లవిలు పోటీపడి నృత్యం చేయడం నయనానందకరంగా సాగింది.గతంలో ఇలాంటి నేపథ్యతోనే డమరుకం క్లైమాక్స్ కోసం దేవిశ్రీ ప్రసాద్ శివుడి మీద ఒక పాటను చేశాడు. అది ఎంత పెద్ద ఛార్ట్ బస్టర్ అంటే ప్రతి ఏడాది ఒక న్యూస్ ఛానల్ నిర్వహించే అతి పెద్ద కోటి దీపోత్సవంకు బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా దీన్నే వాడుకుంటారు. శివరాత్రి మండపాల్లో ఇది వినిపించని ఊరు ఉండదు. తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ తండేల్ కోసం కొట్టాడు దేవి. రెగ్యులర్ లిరిక్ రైటర్స్ ని కాకుండా భక్తి, ఆధ్యాత్మికత మీద అపారమైన పట్టున్న జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో పాట రాయించడం గొప్ప సాహిత్యం వచ్చేలా చేసింది. తండేల్ ఆల్బమ్ లో ఇది బెస్ట్ ట్రాక్ గా నిలిచినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ఓం నమః శివాయకు రెండున్నర మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ప్రస్తుతం శివశక్తి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: