ఎన్టీఆర్ సినిమాలైనప్ ఇదే.. సంక్రాంతి బరిలో ఆ సినిమా..?

Divya
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాలను విడుదల చేసే విధంగానే ప్లాన్ చేస్తున్నారు.. అలా గత ఏడాది దేవర మొదటి భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం అయితే బాలీవుడ్ లో హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ -2 చిత్రంలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నదట. ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి కాబోతున్నట్లు బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్  నిల్ కలయికలో వస్తున్న సినిమా కూడా షూటింగ్ మొదలు కాబోతోందట.. అలాగే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లేవల్లో నిర్మిస్తూ ఉన్నారు. ఈనెల మూడో వారంలో కర్ణాటకలో మొదటి షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ వచ్చే నెలలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నిల్.

ఎన్టీఆర్కు జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా చిత్రబృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. అలాగే డైరెక్టర్ కొరటా శివతో దేవర 2 సినిమా చేయడానికి కూడా మరికొన్ని నెలలు సమయం పడుతుంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వచ్చే యేడాదికి ఏఏ సినిమాలతో అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ మెప్పిస్తారేమో చూడాలి మరి. మొత్తానికి ఈ విషయంతో మరొకసారి ఎన్టీఆర్ పేరు వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: