గేమ్ ఛేంజర్: ఆ ఇద్దరు చనిపోవడానికి కారణం పవన్.. అరెస్టు చేయాల్సిందే అంటూ డిమాండ్..?

Pandrala Sravanthi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఇద్దరి యువకుల మరణానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కారణం అంటూ,ఆయన చెప్పిన తప్పుడు మాటల వల్లే ఆ ఇద్దరు యువకులు ప్రాణాలు వదిలేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసిపి అధికార ప్రతినిధి కే.వెంకటరెడ్డి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి..ఆ ఇద్దరు యువకులు మరణం లో పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రాజమండ్రిలో జరిగిన తన అన్న కొడుకు రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ఈవెంట్ సక్సెస్ అయింది. 
కానీ ఈ ఈవెంట్ అయిపోయాక ఒక విషాదం నెలకొంది. అదేంటంటే గేమ్ ఛేంజర్ ఈవెంట్ చూడడానికి అని వెళ్లి ఓ ఇద్దరు యువకులు ఈవెంట్ చూసి మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో వ్యాన్ ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అయితే ఈ ఇద్దరు యువకుల మరణానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ తాజాగా వైసిపి అధికార ప్రతినిధి కె.వెంకటరెడ్డి ఆరోపణ చేశారు. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ బైక్ సైలెన్సర్లను తీసి యువకులను స్టంట్ చేయాలని చెప్పారు.
 అయితే పవన్ కళ్యాణ్ మాటలు విన్న ఆ ఇద్దరు యువకులు ఈవెంట్ కి వెళ్ళస్తూ చనిపోయారు. ఆ ఇద్దరు యువకుల మరణానికి కారణం పవన్ కళ్యాణ్.. వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేయాల్సిందే అంటూ వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి డిమాండ్ చేయడంతో ప్రస్తుతం ఈయన మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఆ తప్పుడు మాటలు చెప్పారా..ఆ యువకుల మృతికి కారణం పవన్ కళ్యాణ్ నేనా అనేది తెలియాల్సి ఉంది.మరి వెంకట రెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: