రాఖీ సినిమాలో పర్ఫామెన్స్ తో అదరగొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Reddy P Rajasekhar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా రాఖీ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఛార్మి, ఇలియానా హీరోయిన్లుగా నటించారు.
 
రాఖీ సినిమా కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అబవ్ యావరేజ్ గా నిలవడం గమనార్హం. 2006 సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రాఖీ సినిమా విడుదలైన 7 నెలల తర్వాత యమదొంగ థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించడం గమనార్హం.
 
రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. రాఖీ పండగ గొప్పదనాన్ని సైతం ఈ సినిమాలో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో కొన్ని సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలతో సైతం సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. వార్2 సినిమా పాన్ ఇండియా మూవీగా ఈ ఏడాది ఆగష్టులో విడుదల కానుంది. ఎన్టీఆర్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హృతిక్, ఎన్టీఆర్ కాంబో టాలీవుడ్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: