చాలా సంవత్సరాల క్రితం తెలుగులో స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీలు చేస్తూ వచ్చేవారు. కానీ ఆ ట్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగులో చాలా సంవత్సరాలు పాటు స్టార్ హీరోలు నటించిన మల్టీ స్టార్లర్ మూవీలే రాలేదు. అలాంటి సమయంలో విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాను మొదలు పెట్టారు. ఈ మూవీ మొదలు కావడం తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
చాలా సంవత్సరాల తర్వాత అద్భుతమైన క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ కచ్చితంగా బ్లాక్బస్టర్ విజయం అందుకుంటుంది అని ప్రేక్షకులు మొదటి నుండి ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా అంజలి , మహేష్ కి జోడిగా సమంత హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. మొదటి నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను 2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు.
ఇక ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ విన్నర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో పోటీగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన నాయక్ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకున్నా కానీ ఆ మూవీ కంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి మరి ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.