డాకు మహారాజ్ ట్రైలర్ కోసం రంగంలోకి గేమ్ ఛేంజర్ ఎడిటర్..!!

murali krishna
టాలివుడ్ లో ఈ సంక్రాంతి ఫీవర్ ఆల్రెడీ మరింత ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతికి రానున్న లేటెస్ట్ చిత్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం 'డాకు మహారాజ్' కూడా ఒకటి.ప్రతి ఏడాది సంక్రాంతి రేసులో నిలవడమే కాకుండా విజేతగా నిలుస్తూ వస్తున్న నందమూరి బాలకృష్ణ ఈ సారి కూడా 'డాకు మహారాజ్'తో రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీతో పాటు వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో గట్టి పోటీని ఎదురుకోనున్నాడు. శనివారం అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన డల్లాస్ లో ల్యాండ్ అయ్యారు. ఇదే వేదికపై సినిమా ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ ట్రైలర్ కట్ విషయంలో 'గేమ్ ఛేంజర్' టీమ్ బాలయ్య టీమ్ కి అండగా నిలవనుంది.అయితే.. పోటీగా నిలవాల్సిన టీములు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. కాగా, డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ట్రైలర్ ని గేమ్ ఛేంజర్ ఎడిటర్ రూబెన్ కట్ చేశాడు.

ఈ సినిమా ట్రైలర్ ని కట్ చేసేందుకు డైరెక్టర్ బాబీ.. రూబెన్ ని అప్రోచ్ అయ్యాడు. దీనికి రూబెన్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతూ.. ట్రైలర్ కట్ సిద్ధం అయ్యిందని కన్ఫర్మ్ చేశాడు. డాకు మహారాజ్ ట్రైలర్ అదిరిపోయినట్లుగా తెలిపాడు. డైరెక్టర్ బాబీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. దీంతో బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు.అయితే.. పోటీగా నిలవాల్సిన టీములు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. కాగా, డాకు మహారాజ్ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ట్రైలర్ ని గేమ్ ఛేంజర్ ఎడిటర్ రూబెన్ కట్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ని కట్ చేసేందుకు డైరెక్టర్ బాబీ.. రూబెన్ ని అప్రోచ్ అయ్యాడు. దీనికి రూబెన్ సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెబుతూ.. ట్రైలర్ కట్ సిద్ధం అయ్యిందని కన్ఫర్మ్ చేశాడు. డాకు మహారాజ్ ట్రైలర్ అదిరిపోయినట్లుగా తెలిపాడు. డైరెక్టర్ బాబీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. దీంతో బాలయ్య అభిమానులు సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: