టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకున్న కొంత మంది హీరోయిన్లకి ఈ మధ్య కాలంలో పెద్ద విజయాలు లేక డీలా పడిపోయారు. అలాంటి వారు 2025 వ సంవత్సరంతో మంచి కం బ్యాక్ ఇవ్వాలి అనే గట్టి కసితో ఉన్నట్లు తెలుస్తుంది. అలా 2025 లో అదిరిపోయే రేంజ్ సక్సెస్ తో ఫుల్ జోష్ లోకి రావాలి అని అనుకుంటున్నా హీరోయిన్ల లిస్టులో ఉన్న వారు ఎవరో తెలుసుకుందాం.
కృతి శెట్టి : ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దానితో ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె ఉప్పెన తర్వాత నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత నుండి ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి. పోయిన సంవత్సరం ఈమె నటించిన మనమే సినిమా కాస్త పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. మరి ఈ సంవత్సరం ఈమె మంచి విజయాన్ని అందుకొని కం బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.
పూజా హెగ్డే : కెరియర్ను ప్రారంభించిన కొత్తలోనే అనేక మంది స్టార్ హీరోల సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకున్న ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య కాలంలో సరైన విజయాలు లేవు. ప్రస్తుతం మాత్రం ఈమె అనేక సినిమాల్లో నటిస్తోంది. మరి 2025 వ సంవత్సరం ఈమె సూపర్ సాలిడ్ విజయంతో మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందేమో చూడాలి.
రాశి ఖన్నా : టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన స్థాయికి చేరుకున్న ఈమెకు ఈ మధ్య కాలంలో తెలుగు లో సరైన విజయాలు లేవు. ప్రస్తుతం ఈమె సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకుని తెలుగులో మళ్లీ సక్సెస్ తో కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.