గేమ్ ఛేంజర్: చరణ్, శంకర్ లకు రెమ్యూనరేషన్ లో కోతలు ?
ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినప్పటికీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే బజ్ క్రియేట్ అవుతుంది. ఇక రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న జరగబోతోంది. పవన్ కళ్యాణ్ దీనికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. ఇది ఇలా ఉండగా..... ఈ సినిమాను శంకర్ మూడేళ్ల నుంచి షూట్ చేస్తున్నారట. అందుకే ప్రొడక్షన్ ఖర్చులు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ మార్కెట్ ఇమేజ్ భారీగా పెరిగింది. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ కేవలం రూ. 60 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని సమాచారం అందుతుంది.
అలాగే శంకర్ రూ. 35 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ పెరగడంతో వీరిద్దరూ తమ రెమ్యూనరేషన్ ని కొంత మొత్తాన్ని త్యాగం చేశారట. ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం రామ్ చరణ్ చేసిన గొప్ప పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమాతో మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలతో పోటీపడి గేమ్ చేంజర్ సినిమా మంచి టార్గెట్ రీచ్ అవ్వాలని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు.