మొదటి సినిమాతో భారీ నష్టాలు .. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ హోంబలే..!
ఇక తర్వాత మాస్టర్ పీస్ అనే సూపర్ హిట్ సినిమాతో హోంబలే ఫిలిం సంస్థ పేరు కన్నడ చిత్ర పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది . ఆ తర్వాత కేజిఎఫ్ 1 , కేజీఎఫ్ 2 , కాంతారా సినిమాలతో హోంబలే ఫిలిమ్స్ పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయింది .. ఇక 2023 లో ప్రభాస్ తో సలార్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ లో వర్షం కురిపించుకుంది .. ఇలా ఇండియన్ చిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్గా హోంబలే సంస్థ ఎదిగింది .. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి ..
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఏకంగా ఈ సంస్థ నుంచి ఇప్పటికే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అలాగే మరో మూడు సినిమాలు కూడా ఈ సంస్థతొ ప్రభాస్ చేయబోతున్నాడు .. అలాగే ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్‌తో చేయబోయే డ్రాగన్ మూవీ కూడా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచే రాబోతుంది. ఇలా వరుసపాన్ ఇండియ హీరోలందరూ హోంబలె సంస్థ ఫిక్స్ చేసేసుకుంది . ఇక మరి రాబోయే రోజుల్లో ఈ సంస్థ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.