ఆ సినిమా టీవీలో వస్తే తారక్ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి..ఎందుకంటే..?
అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా విషయంలో చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారట . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన "భధ్త" సినిమా కధను ముందుగా ఆయన ఎన్టీఆర్ కి వివరించారట. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేయడానికి నిరాకరించారట . ఆ తర్వాత ఈ సినిమా రవితేజ ఖాతాలో పడింది . ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలుసు . కాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ఇప్పటికీ టీవీలో చూసిన చాలా బాధపడిపోతారట .
అయ్యో.. ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేదేమో ..? అని అంటూ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయట . ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు . అదేవిధంగా దేవర 2 ని కూడా సెట్స్ పైకి త్వరగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు . ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే సినిమా కోసం కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!