శ్రీకాంత్ ఓదెల సినిమాకు రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన చిరు.. అన్ని కోట్లా...!

RAMAKRISHNA S.S.
- శ్రీకాంత్ ఓదెల సినిమాకు చిరు కు రు. 75 కోట్ల రెమ్యున‌రేష‌న్ .. ?
- విశ్వంభ‌ర రిలీజ్ అయిన వెంట‌నే సెట్స్ మీద‌కు .. ?

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంట‌సీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి సోషియో ఫాంట‌సీ సినిమాగా రూపొందిస్తుండడంతో ఈ సినిమాని ఎప్పుడు ? చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. డిసెంబర్ సినిమా రిలీజ్ కాకముందే చిరు తన తర్వాత ప్రాజెక్టును కూడా అనౌన్స్‌ చేశారు. ద‌స‌రా సినిమా తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత లూగించేసిన‌ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల‌ దర్శకత్వంలో చిరు తర్వాత సినిమా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ పూర్తి వైవిధ్యమైన కథతో తెర‌కెక్కించ నున్నారు. ద‌స‌రా సినిమా తో శ్రీకాంత్ పై టాలీవుడ్ లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపెట్టబోతున్నాడని చిత్ర యూనిట్ ఎప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమా కోసం చిరు తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు చాలావరకు తమ రెమ్యూనరేషన్ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలు చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ మాత్రం రెమ్యూనరేషన్ పెంచడం లేదని వార్తలు వినిపించాయి. అయితే వరుస హిట్లుతో ఉన్న బాలయ్య చాలా స్వల్పంగా రెమ్యూనరేషన్ పెంచిన పరిస్థితి. ఇప్పుడు సీనియర్ హీరోల్లో చిరంజీవి కూడా శ్రీకాంత్ ఓదెల‌ సినిమా కోసం ఏకంగా రు . 75 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా చిత్ర యూనిట్ మొత్తానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: