వెంకీ సూప‌ర్ హిట్ - చిరు హిట్ - బాల‌య్య ఫ‌ట్‌.. అప్ప‌డు ఏం జ‌రిగిందంటే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి మజా మామూలుగా ఉండదు. సంక్రాంతి సినిమా ల‌కు ఉండే క్రేజ్ వేరు.. ఆ సినిమా ల‌పై ఉండే అంచ‌నాలు వేరు. ఈ క్రమంలోనే కరెక్ట్ గా 2000 సంవత్సరంలో ముగ్గురు స్టార్ హీరోలు నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్ కలిసుందాం రా - మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య - నట‌సింహ నందమూరి బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. తమిళంలో హిట్ అయిన సినిమా కు రీమేక్ గా కలిసుందాం రా వచ్చింది. సురేష్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ పై అగ్ర నిర్మాత‌ సురేష్ బాబు ఈ సినిమా ను నిర్మించారు. సిమ్రాన్ హీరోయిన్ .. ఫ్యామిలీ కథాంశం తో తెరకెక్కిన కలిసుందాం రా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు చాలా కేంద్రాలలో 150 రోజులు .. 175 రోజులు .. 200 రోజులు కూడా ఆడింది. ఈ ఏడాది వచ్చిన మూడు సినిమాలలో తిరుగులేని బ్లాక్ బ‌స్టర్ హిట్గా నిలిచింది .. భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి - ముత్యాల సుబ్బయ్య కాంబినేష‌న్ లో తెరకెక్కిన అన్నయ్య సినిమా అన్నదమ్ముల కథ అంశంతో తెరకెక్కింది. సౌందర్య హీరోయిన్ .. జనవరి 1న రిలీజ్ అయిన ఈ సినిమా అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంది. పలు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక జనవరి 14న రిలీజ్ అయిన బాలకృష్ణ వంశోద్ధారకుడు సినిమా అంచనాలు అందుకోలేదు. ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ - సాక్షి శివానంద్ హీరోయిన్లుగా నటించారు. వంశోద్ధారకుడు సినిమా కొన్ని కేంద్రాల లో 50 రోజులు మాత్రమే పూర్తి చేసుకుంది. అలా ఆ సంక్రాంతికి వెంకటేష్ సూపర్ హిట్ కొడితే .. చిరంజీవి హిట్టు కొడితే ... బాలయ్య ప్లాప్ సినిమాతో సరిపెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: