రాజమౌళి కోసం రాజీపడిన మహేష్ !
మహేష్ తన సినిమాల ప్రారంభోత్సవానికి ఎప్పుడు రాడు. కేవలం తన భార్య నమ్రతను మాత్రం తన సినిమాల ప్రారంభోత్సవానికి పంపడం కొన్ని సంవత్సరాలుగా అతడికి సెంటిమెంట్ గా మారింది. అయితే దీనికి భిన్నంగా ఈ మూవీ పరంభోత్సవ కార్యక్రమానికి మహేష్ రావడంతో రాజమౌళి కోసం తన సెంటిమెంట్ ను పక్కకకు పెట్టాడు అన్న మాటలు వినిపించాయి.
ఈసినిమాను 1000 కోట్ల భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తీస్తారని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగం 2027 లో విడుదల అయితే రెండవ భాగం 2029 లో విడుదల అవుతుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే మరో రెండు సంవత్సరాల వరకు మహేష్ వైపు నుంచి సినిమా వచ్చే ఆస్కారంలేదు.
ఒక ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ తో పాటు మరో క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ ఈ మూవీలో మహేష్ పక్కన నటిస్తారు అని అంటున్నారు. ఈ మూవీలో నటించినందుకు అదేవిధంగా దర్శకత్వం వహించినందుకు మహేష్ తో పాటు జక్కన్న కూడ పారితోషికం తీసుకోకుండా ఈమూవీకి వచ్చే లాభంలో 40 శాతం షేర్ తీసుకుంటారని లీకులు వస్తున్నాయి. ఈమూవీ బడ్జెట్ భారీ స్థాయిలో ఉండటంతో ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు అయిన సోనీ డిస్నీ సంస్థలలో ఏదో ఒక సంస్థ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తన హెయిర్ ను పూర్తిగా మార్చుకున్న మహేష్ జక్కన్న సలహాతో తన ఫిజిక్ విషయంలోను అదేవిధంగా తన డైట్ విషయంలో చాల మార్పులు చేర్పులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది..