SSMB -29: సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తున్న మహేష్..!
ముఖ్యంగా మహేష్ బాబుకి టైటిల్స్ విషయంలో చాలా సెంటిమెంట్ ఉంటుంది. మురారి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు అనంతరం ఎక్కువగా మూడు అక్షరాల టైటిల్ ని ఫాలో అవుతూ ఉంటారు.. అలా ఇప్పటివరకు అతడు, ఒక్కడు, దూకుడు, పోకిరి ,ఆగడు , ఖలేజా ఇతరత్ర సినిమాలు కూడా ఉన్నవి. ఎక్కువగా మహేష్ బాబు ఆ అనే అక్షరంతో వచ్చే సినిమాలనే చేస్తూ ఉండేవారు.. అలాగే మహేష్ బాబు ఎప్పుడూ కూడా ఏదైనా కొత్త సినిమా పూజా కార్యక్రమాలకి తన భార్యని , కుటుంబ సభ్యులను మాత్రమే పంపిస్తూ ఉంటారు.
అయితే రాజమౌళి సినిమా కోసం ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్లుగా సమాచారం. జనవరి 2వ తేదీన ఈ సినిమా పూజ కార్యక్రమాలను చాలా గ్రాండ్గా చేశారట. అంతేకాకుండా మహేష్ బాబు కారు కూడా రావడం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా రాజమౌళి ఒత్తిడి వల్లే మహేష్ బాబు వచ్చారని నమ్రత తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారని సమాచారం. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న SSMB 29 సినిమా రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రానికి సంబంధించి నటీనటుల వ్యవహారాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటిస్తుందేమో చూడాలి.