"16 సంవత్సరాలుగా వైరల్ అవుతున్న వార్తపై స్పందించిన రామ్ చరణ్"..ఏమన్నాడంటే..!?

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు మారుమ్రోగిపోతుంది . అన్ స్టాపబుల్ షో కి కూడా ఆయన ఫస్ట్ టైం గెస్ట్ గా హాజరయ్యారు. ఎప్పటినుంచో ఈ షో కి రాంచరణ్ రప్పించాలి అంటూ తెగ ట్రై చేస్తున్నాడు అల్లు అరవింద్. ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చింది . గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్   షో కి గెస్ట్ గా హాజరయ్యారు . కాగా రాక రాక రామ్ చరణ్ ఒక టాక్ షోకి గెస్ట్ గా రావడంతో ఆయన గురించి ప్రజలు తెలుసుకోవాలి అనుకుంటున్నా విషయాలు అన్నిటిని బయటపెట్టించేసాడు బాలయ్య.


మరి ముఖ్యంగా రామ్ చరణ్ పై 16 ఏళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త గురించి ప్రశ్నించి ఆన్సర్ చెప్పించాడు బాలయ్య అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే సోషల్ మీడియాలో రామ్ చరణ్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రూమర్ బాగా సర్కులేట్ అయింది . రామ్ చరణ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ప్రేమించారు అని.. కానీ ఆ ప్రేమ పెటాకులు అయిపోయింది అని ..బాగా వార్తలు ట్రెండ్ అయ్యాయి. అసలు రాంచరణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే ఉపాసనను ప్రేమిస్తూ వచ్చాడు. మరి ఇండస్ట్రీ లోకి వచ్చాక కాజల్ ని ఎలా ప్రేమిస్తాడు ..? అంటూ మెగా ఫాన్స్ కూడా మండిపడ్డారు .


ఇదంతా అబద్ధం అంటూ కొట్టి పడేశారు . కానీ గత పదహారేళ్లుగా సోషల్ మీడియాలో ఈ వార్త అడపాదడపా వైరల్ అవుతూనే వచ్చింది. దీంతో ఫర్ ద ఫస్ట్ టైం ఒక టాక్ షోలో రామ్ చరణ్ ఈ వార్త పై స్పందించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్త గురించి ప్రశ్నించగా రామ్ చరణ్ దాన్ని మొత్తం కొట్టి పడేసారట . ఆ కారణంగానే ఉపాసనతో లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ..? ఎలా స్టార్ట్ అయింది..? ఎవరు ప్రపోజ్ చేశారు ..? అన్న తన లవ్ మేటర్ మొత్తం కూడా బయట పెట్టేసాడట . మొత్తానికి తనపై ఎటువంటి నింద లేకుండా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చినట్లే ఉన్నాడు రామ్ చరణ్ . రామ్ చరణ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్  అయ్యే వరకు ఆగాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: