గేమ్ చేంజర్ : చరణ్ కోసం రంగంలోకి తమిళ ఇండస్ట్రీ.. పుష్ప 2 రికార్డులు బ్రేక్ కావాల్సిందే ?

Veldandi Saikiran
రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమానంతరం రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ కావడం విశేషం. ఈ సినిమాకు దక్షిణాది స్టార్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలోనూ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా విక్రమ్ - వీర ధీర సూరన్, బాల - వనంగాన్ అజిత్ - విడాముయర్చి సినిమాలు జనవరి 10వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదట.


షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వీర ధీర సురన్ సినిమాను వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. బాల వనంగాన్ సినిమా రిలీజ్ విషయంలోనూ కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఫైనల్ గా రిలీజ్ అవుతుంది అనుకున్న విడాముయర్చి సినిమా కూడా వాయిదా పడింది. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ త్రిల్లర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడడంతో గేమ్ చేంజర్ కు తమిళనాట పెద్ద ఇబ్బంది ఉండదన్న టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా గేమ్ చేంజర్ సినిమాకు తమిళనాట భారీ పోటీ తప్పదనుకుంటున్న సమయంలో తమిళ తంబీలు సైడ్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు పెద్దగా పోటీ లేదు అని రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: