మెగాస్టార్ మూవీపై శ్రీకాంత్ కీలక నిర్ణయం.. షాక్ లో ఫ్యాన్స్..!!

murali krishna
శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. నాని ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. నానికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇక నెక్ట్స్ పారడైజ్ అంటూ నానితో మళ్లీ శ్రీకాంత్ ఓదెల ప్రయోగం చేయబోతోన్నాడు. ఈ మూవీ లైన్లో ఉండగానే చిరంజీవితో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను నానియే సెట్ చేయించినట్టుగా కనిపిస్తోంది. ఈ చిరు ఓదెల ప్రాజెక్ట్‌కి నాని సమర్ఫకుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిరు ఓదెల మూవీ మీద రకరకాల రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే.వింటేజ్ చిరుని చూపిస్తాడని.. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని.. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండవని, ఇదొక ప్రయోగం అని ఇలా చాలా రకాలుగానే రూమర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని నిర్మాత ఖండించాడు. ఇంకా ఏం డిసైడ్ కాలేదని, అంతా జనాలే అనుకుంటున్నారని, సోషల్ మీడియా రూమర్లను కొట్టి పారేశాడు. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడట.
చిన్నప్పటి నుంచీ చిరంజీవి సినిమాల్ని చూసుకుంటూనే పెరిగానని, అలాంటిది తానిప్పుడు ఆయనతో కలిసి పని చేస్తున్నాను.. ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతోన్నాను అంటూ శ్రీకాంత్ ఓదెల తన సంతోషాన్ని పంచుకున్నాడు. కేవలం 48 గంటల్లోనే స్క్రిప్ట్ ఓకే చేయించుకున్నానని తెలిపాడు. స్క్రిప్ట్ ఓకే అయ్యాక నేను ఆకాశంలో తేలియాడినట్టుగా అనిపించిందంటూ శ్రీకాంత్ ఓదెల తెలిపాడు.ఇది వరకు చిరంజీవి చేసిన అన్ని సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందని తెలిపాడు. ఇదేమీ వింటేజ్ చిరులా ఉండదని, చాలా కొత్తగా, ఫ్రెష్ కారెక్టరైజేషన్ అని అన్నాడు. ఏజ్‌కు తగ్గ అవతార్‌లోనే కనిపించనున్నాడని పేర్కొన్నాడు. కేరవ్యాన్నుంచి దిగే వరకే నేను చిరంజీవి అభిమానిని ఒక్కసారి ఆయన సెట్ మీదకు వచ్చారంటే నా సినిమాలోని ఓ పాత్ర మాత్రమే అంటూ తనలోని దర్శకుడి గురించి శ్రీకాంత్ ఓదెల ఎంతో కాన్ఫిడెంట్‌తో చెప్పాడు. మరి శ్రీకాంత్ ఓదెల ఎలాంటి వరల్డ్‌ని క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: