Jr.ఎన్టీఆర్ ని అవమానించిన బోనీ కపూర్.?

Pandrala Sravanthi
ఏంటి తన కూతురు మొదటి పాన్ ఇండియా మూవీ అయినటువంటి దేవర మూవీలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ని బోనికపూర్ అవమానించారు. ఇంతకీ బోని కపూర్ కి ఎన్టీఆర్ కి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది? బోనికపూర్ ఎన్టీఆర్ ని అవమానించడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా ఒక పెద్ద డిబేట్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఆ డిబెట్లో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు, టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు పాల్గొని రచ్చ రచ్చ చేశారు. మా ఇండస్ట్రీ గొప్ప అంటే మా ఇండస్ట్రీ గొప్ప అని ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీని చిన్నచూపు చూసేది కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల్లో నటీంచడానికి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు,హీరోలు కూడా ఆరాటపడుతున్నారు. అయితే అలాంటి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి బోని కపూర్ కాస్త వెటకారంగా మాట్లాడారు.. 

ఇక ఈ డిబేట్లో తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడినప్పుడల్లా నాగ వంశీ బాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఇచ్చి పడేశాడు. ఇందులో భాగంగా సిద్ధార్థ్ బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ..ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీ ఎక్కువగా కొత్త డైరెక్టర్ ల నుండి వచ్చే సినిమాలతో పాటు కొత్త మొహాన్ని అంటే కొత్త హీరో లను ఆదరిస్తున్నారు అని చెప్పారు. దానికి బోనీ కాపూర్ మాట్లాడుతూ.. అవును ఈ మధ్యకాలంలో ఆదిత్య చోప్రా తన సినిమా కోసం ఎన్టీఆర్ ని తీసుకున్నాడు. అంటే ఆయన కొత్త మొహమే కదా అని అన్నారు.దీనికి సిద్ధార్థ్ మాట్లాడుతూ ఆయన కొత్త మొహం కాదు. ఎన్టీఆర్ పెద్ద స్టార్.. ఇద్దరు పెద్ద హీరోలు ఒక పెద్ద నిర్మాతతో సినిమా చేస్తున్నారు అంటూ సిద్ధార్థ్ చెప్పగానే బోనీకపూర్ కాస్త సైలెంట్ అయిపోయాడు.

అయితే బోనీ కపూర్ ఎన్టీఆర్ ని కొత్త మొహం అని మాట్లాడడంతో ఎన్టీఆర్ ని అవమానించాడంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బోనీ కపూర్ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు కొత్త మొహం అని తారక్ ని అవమానించావు కదా..నీ కూతుర్ని అడుగు ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో..అప్పుడు చెబుతుంది నీకు ఆన్సర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికి బోనీకపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తక్కువ చేసి మాట్లాడడం మాత్రం టాలీవుడ్ అభిమానులకి మింగుడు పడడం లేదు. టాలీవుడ్ ని చిన్నచూపు చూసే నువ్వు ఎందుకు నీ కూతుర్ని బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వెళ్ళమని సలహా ఇచ్చావు అంటూ ఏకిపారేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: