మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్గా నటించగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ నుండి బాలయ్య హీరోగా రూపొందిన డాకు మహారాజ్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దానితో గేమ్ చేంజర్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టి పోటీ నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో మొదటి నుండి కూడా తమిళ ప్రేక్షకులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే తమిళ స్టార్ నటుడు అయినటువంటి అజిత్ కుమార్ హీరోగా రూపొందిన విడమూయర్చి సినిమాను కూడా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా తమిళ రాష్ట్రాల్లో ఈ మూవీ కి కలెక్షన్లు తక్కువ వస్తాయి అని చాలా మంది భావించారు.
ఇకపోతే తాజాగా విడమూయర్చి సినిమాను వాయిదాను వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో గేమ్ చెంజర్ సినిమాకు కనుక తమిళ్ లో మంచి టాక్ వచ్చినట్లయితే ఈ మూవీ కి తమిళనాడు ఏరియాలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ సినిమా తమిళనాడు ఏరియాలో ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.