న్యూ ఇయర్ రోజున వర్మ షాకింగ్ డెసిషన్..అయ్యేపనేనా..?

Divya
రాంగోపాల్ వర్మ ఏలాంటి విషయాలు మాట్లాడిన కూడా అవి సెన్సేషనల్ గా మారుతూ ఉంటాయి.. న్యూ ఇయర్ సందర్భంగా రాంగోపాల్ వర్మ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి సైతం స్వాగతం పలుకుతూ తన జీవితంలో సాధించబోయే విషయాల పైన ఇటీవలే తన ట్విట్టర్ నుంచి కొన్ని పాయింట్స్ ని తెలియజేశారు. అయితే ఈ పాయింట్స్ చూసిన చాలామంది నెటిజెన్స్ ఇవి సాధ్యమయ్యేవి కాదులే వర్మ అంటు కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి వాటి గురించి పూర్తిగా చూద్దాం.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన వర్మ ఈ మధ్యకాలంలో తను తెరకెక్కించే సినిమాలలో యూత్ ని బాగా ఆకట్టుకుని బోల్డ్ కంటెంట్ ఉండడంతో పాటుగా రాజకీయాల సినిమాలను కూడా గతంలో ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఏడాది తాను తీసుకున్న 7 నిర్ణయాలను మొదలుపెట్టి పెట్టానని వాటి గురించి తెలియజేశారు.

1). తాను ఇక నుండి వివాదరహితుడిగా ఉండాలని నిర్ణయాన్ని తీసుకున్నాను అంటూ తెలిపారు.

2). తాను కూడా ఒక మంచి ఫ్యామిలీ మెన్ గా ఉండాలని భావిస్తున్నట్లుగా తెలియజేశారు.

3). దేవుడి పట్ల భయం భక్తి కూడా కలిగి ఉంటానని వెల్లడించారు వర్మ.

4). ప్రతి ఏడాదికి 10 సత్య లాంటి సినిమాలను తీసుకువస్తానంటూ తెలియజేశారు.
5). ఎవరి గురించి నెగటివ్ ట్విట్స్ చేయను అంటూ కూడా వెల్లడించారు.

6). ముఖ్యంగా ఆడవాళ్ళని అసలు చూడను అంటూ తెలియజేశారు.
 
7). అలాగే ఒక్క తాగడం కూడా మానేస్తానంటూ వర్మ తెలియజేశారు అందుకు సంబంధించి ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది..
వీటన్నిటిని కచ్చితంగా పాటిస్తానని మీ అందరి మీద ఒట్టేస్తున్నానని.. తన మీద తప్ప అందరి మీద వేస్తున్నానని స్టైల్ వర్మ ట్విట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్విట్ వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: