సంక్రాంతి మూవీల టికెట్ ధరలు ఇవే.. ఆ సినిమాకు అధిక ధరలు..?

Pulgam Srinivas
స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ఆ సినిమాలకు టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయా అనే విషయంపై జనాలు అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా కూడా భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దానితో కొంతమంది టికెట్ ధరలు ఎక్కువ ఉన్నట్లయితే సినిమాను లైట్ తీసుకుంటున్నారు ఒకవేళ సినిమా టికెట్ ధరలు కనక రీజనబుల్ గా ఉన్నట్లు అయితే సినిమాలు థియేటర్కు వెళ్లి చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

దానితో ఏదైనా స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టికెట్ ధరలు ఉంటున్నాయా అని తెలుసుకునేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇక పోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేజర్ బాలయ్య హీరోగా రూపొందిన ఢాకో మహారాజ్ విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి మరి ఈ సినిమాకు టికెట్ ధరలు ఎలా ఉండను అనేదానిపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఇక కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ సినిమాకు టికెట్ ధరలు పెంచబడును అని చెప్పాడు దానితో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు సినిమాలు కూడా సాధారణమైన టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయి అని భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూవీ టికెట్ ధరలు ఎలా ఉండనున్నాయి అనేదానిపై ఓ వార్త వైరల్ అవుతుంది.

ఆ వార్త ప్రకారం ... గేమ్ ఛేంజర్ మూవీకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.135 రూపాయలు గాను ,  మల్టీప్లెక్స్ థియేటర్లలో 175 రూపాయలు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ బెనిఫిట్ షో టికెట్ రేట్లు 600 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డాకు మహారాజ్ మూవీకి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110 ,  మల్టీప్లెక్స్‌లలో రూ.135 పెంపుకు , బెనిఫిట్ షో టికెట్ రేటు 500 రూపాయలు ఉండే విధంగా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 ,  మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంపు ఉండే విధంగా పర్మిషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: