మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె నేను శైలజ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ రావడంతో తెలుగు లో ఈమెకు కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు దక్కాయి.
దానితో చాలా తక్కువ కాలం లోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా హిందీ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా సమంత హీరోయిన్గా అట్లీ దర్శకత్వంలో తేరి అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను తాజాగా అట్లీ , వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా హిందీ లో రీమిక్ చేశాడు.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ సినిమా అవకాశం రావడానికి ఎవరు సహాయపడ్డారు అనే విషయాన్ని కీర్తి సురేష్ తాజాగా చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ ... సమంత వాళ్ళ నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది అని ఈమె తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పింది.