RC 16 : సుకుమార్ సమక్షంలోనే బుచ్చిబాబు మూవీ..చరణ్ అలాంటి కండిషన్ పెట్టాడా..?

frame RC 16 : సుకుమార్ సమక్షంలోనే బుచ్చిబాబు మూవీ..చరణ్ అలాంటి కండిషన్ పెట్టాడా..?

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ పై రోజు రోజుకు మెగా ఫ్యాన్స్ ఆసక్తి పెరుగుతూ వస్తుంది.. ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ లైనప్ లో రెండు సినిమాలు ఉన్నాయని తెలిసిందే. ప్రస్తుతం బుచ్చి బాబు మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ఇటీవల ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఆ మూవీ లో రామ్ చరణ్ సరికొత్తగా కనిపించునున్నారు.. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.. అయితే సుకుమార్ కాంబినేషన్ లో ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.డైరెక్టర్ బుచ్చి బాబు చరణ్ సినిమాకు కూడా సుకుమార్ సపోర్ట్ ఉండనుంది. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన కూడా సుకుమార్ ఆధ్వర్యంలోనే తెరకెక్కించాడు.

ఇక ఇప్పుడు చరణ్ తో చేస్తున్న సినిమాకు బ్యాక్ సపోర్ట్ కూడా సుకుమార్ ఉంటాడని తెలుస్తుంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను డీల్ చెయ్యాలంటే సుకుమార్ అనుభవం ఉండాలని అనుకుంటారు. సుకుమార్ ఇటీవలే అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ మూవీ ఎలా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసిందో తెలిసిందే.. ఆ మూవీ రామ్ చరణ్ తో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్నాయి. ఎలాంటి కాన్సెప్ట్ తో సినిమాలు రాబోతుందో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఈ సినిమా తో పాటు మరో సినిమాకు కూడా సుకుమార్ దర్శకత్వం చెయ్యనున్నారని టాక్.. RC 16, 17 రెండు సినిమాలు కూడా సుకుమార్ చేస్తున్నట్టే లెక్క. సుకుమార్ తో రాంచరణ్ రంగస్థలం సినిమా చేశాడు. చరణ్ ని అప్పటివరకు అందరు ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించాడు. రంగస్థలం నుంచే రామ్ చరణ్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. రెండు సినిమాలు సుకుమార్ లాంటి డైరెక్టర్ సమక్షంలో రావడం మెగా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేస్తుంది. ఏది ఏమైనా చరణ్ రాబోతున్న సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని చెప్పొచ్చు. బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుండగా సుకుమార్ చరణ్ కాంబో మూవీ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: