గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్.. సినిమాకి హైలెట్ అదేనట..?
గేమ్ ఛేంజర్ చిత్రానికి U/A సర్టిఫికెట్ కూడా వచ్చిందట. అంతేకాకుండా సెన్సార్ సభ్యులు చెప్పిన మేరకు రివ్యూ కూడా ఇచ్చినట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ సినిమాని చూసి సెన్సార్ సభ్యులు ఆశ్చర్యపోయారట. ఇంటర్వెల్ సన్నివేశాలు షాక్ అయ్యేలా ఉంటాయని. ఫస్టాఫ్ సూపర్ గా ఉందని అయితే ఇంటర్వెల్ కు ముందు 20 నిమిషాలు ఈ సినిమాకి హైప్ క్రియేట్ చేస్తుందని తెలిపారు. అలాగే ట్రైన్ ఎపిసోడ్స్ ఇన్ కూడా ఒక 20 నిమిషాల పాటు ఉంటుందని చాలా ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుందని తెలిపారు.
గేమ్ ఛేంజర్ సినిమా అసలు కథ ఇంటర్వెల్ తర్వాతే ఉంటుందట సినిమాకు సెకండాఫ్ కీలకమని ఓ రేంజ్ లో డైరెక్టర్ శంకర్ ఇంటర్వెల్ తర్వాత సినిమాని తెరకెక్కించారని తన ట్రెండు మార్క్ మరొకసారి చూపించారు. రామ్ చరణ్ ఖాతాలో కచ్చితంగా మరొక బ్లాక్ బాస్టర్ సినిమా పడుతుందని సెన్సార్ కంప్లీట్ అయిన తర్వాత తెలియజేశారు. అయితే ఈ సినిమాని ఇటీవలే చిరంజీవి కూడా చూశారని సంక్రాంతికి కొడుతున్నామని చెప్పమంటూ అభిమానులతో కూడా చెప్పారని నిర్మాత దిల్ రాజు కూడా ఇటీవలే ఈ విషయాన్ని తెలిపారు. జనవరి 10వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.